KIDNEY TRANSPLANT IN TELUGU

హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడి | విధానం, ఖర్చు & విజయవంతమైన రేట్

మా వద్ద ఉత్తమ మూత్రపిండ మార్పిడి సర్జన్లు మరియు మార్పిడి నెఫ్రాలజిస్టుల బృందం ఉంది. సజీవ దాత మూత్రపిండ మరియు మరణించిన దాత మూత్రపిండ మార్పిడి (కాడవెరిక్ కిడ్నీ మార్పిడి) ప్రక్రియలు అధిక విజయవంతమైన రేటుతో నిర్వహించడంలో అపారమైన అనుభవం ఉంది.

అపాయింట్‌మెంట్ కోసం కాల్ చేయండి: 040 4848 6868

అపాయింట్‌మెంట్ అభ్యర్థించండి


Kidney Transplant Appointment Telugu

top 10 kidney transplant hospital in India | best hospital for kidney transplant in hyderabad | kidney transplant cost in hyderabad, India

కిడ్నీ మార్పిడి కోసం అధునాతన కేంద్రం హైదరాబాదు, తెలంగాణాలో

హైదరాబాద్ నందు ఉన్న అధునాతన మరియు ఉత్తమమైన కిడ్నీ మార్పిడి కేంద్రములలో మాది ఒకటిగా ఉంది, మా వద్ద ఉత్తమ కిడ్నీ మార్పిడి సర్జన్లు, కిడ్నీ మార్పిడి వైద్యులు, కిడ్నీ మార్పిడి నెఫ్రాలజిస్ట్‌లు (కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్), ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ (గుండె శస్త్ర చికిత్స నిపుణులు) & పల్మోనాలజిస్ట్ (ఊపిరితిత్తుల వైద్యులు ), ఎండోక్రినాలజిస్ట్ (వినాళిక గ్రంధుల వైద్యులు), వాస్కులర్ సర్జన్ (నాళ సంబంధిత వైద్య నిపుణులు), ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్, మానసిక వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది, డైటీషియన్ (పోషకాహార నిపుణులు) మరియు ఫిజియోథెరపిస్ట్.


భారతదేశంలోని హైదరాబాద్‌ నందు ఉన్నపేస్ హాస్పిటల్స్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ బృందం, కిడ్నీ గ్రహీత మరియు కిడ్నీ దాత యొక్క ఫిట్‌నెస్‌ను నిర్ధారించడానికి వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, CT స్కాన్ లేదా MRI స్కాన్‌తో సహా రేడియోలాజికల్ పరిశోధనలు చేయడం ద్వారా మూత్రపిండ మార్పిడికి ముందు దాత మరియు గ్రహీత ఆరోగ్య స్థితిని క్షుణ్ణంగా అంచనా వేస్తుంది. జీవించి ఉన్న డోనర్ కిడ్నీ మార్పిడి తర్వాత దాత యొక్క విస్తృతమైన మరియు వివరణాత్మక మూల్యాంకనం చేయబడుతుంది, ఎందుకనగా మార్పిడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చే ముందు దాత యొక్క భద్రత చాలా ముఖ్యం.

ఉత్తమ కిడ్నీ మార్పిడి వైద్యుడు హైదరాబాద్ లో, హైటెక్ సిటీ మరియు మదీనాగూడ

Dr. Vishwambhar Nath - best kidney transplant surgeon in India | best doctor for renal transplant in Hyderabad

డా. విశ్వంభర్ నాథ్

40+ సంవత్సరాల అనుభవం

MBBS, MS (General Surgery), DNB (Urology), M.Ch (Urology) (CMC Vellore, Tamil Nadu)

సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ & మూత్రపిండ మార్పిడి సర్జన్

Dr. A Kishore Kumarbest kidney transplant doctor in India | best doctor for kidney transplant in Hyderabad

డా. ఎ కిషోర్ కుమార్

11+ సంవత్సరాల అనుభవం

MD (Medicine) (JIPMER), DM (Nephrology) (AIIMS, New Delhi)

కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు మూత్రపిండ మార్పిడి వైద్యుడు

Dr. Abhik Debnath - Best kidney transplant surgeons in Hyderabad | best doctor for renal transplant in India

డా. అభిక్ దేబ్నాథ్

10+ సంవత్సరాల అనుభవం

MBBS, MS (General Surgery - IMS, BHU), MCh (Urology - CMC Vellore), DNB (Urology)

కన్సల్టెంట్ లాపరోస్కోపిక్ యూరాలజిస్ట్, ఎండోరాలజిస్ట్, ఆండ్రోలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్

కిడ్నీ మార్పిడి విభాగం

పేస్ హాస్పిటల్స్‌లోని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విభాగం, జీవించి ఉన్న దాత మరియు మరణించిన దాత మూత్రపిండ మార్పిడి యొక్క విస్తృతమైన మరియు అత్యంత గుర్తించదగిన నాణ్యతను అందిస్తుంది. ఈ విభాగం అంకితమైన మూత్రపిండ మార్పిడి మరియు నిబద్దతతో కూడిన ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు) మల్టీడిసిప్లినరీ బృందాన్ని కలిగి ఉంది, ఈ విభాగం సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతమైన రేటు సాధించడంలో సహాయపడుతుంది.


మా మూత్రపిండ మార్పిడి సర్జన్లు, నెఫ్రాలజిస్ట్‌లు మరియు కిడ్నీ స్పెషలిస్ట్ వైద్యుల బృందం సంక్లిష్ట శస్త్రచికిత్సలు మరియు అవయవ మార్పిడి చేయడంలో అధిక అర్హత కలిగి ఉన్నారు మరియు వారు శస్త్రచికిత్సను ఖచ్చితత్వంతో నిర్వహించడానికి విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ట్రాన్స్‌ప్లాంట్ బృందం ది వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సల్ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్, సరికొత్త లేజర్ ట్రీట్‌మెంట్ పరికరాలు, అత్యాధునిక సదుపాయంతో సమగ్ర చికిత్సను అందించే ఆధునిక సాంకేతికత కలిగి ఉంది.


PACE Hospitals (పేస్ హాస్పిటల్స్) తెలంగాణలోని హైదరాబాద్‌ నందు ఉన్న ఉత్తమ కిడ్నీ మార్పిడి ఆసుపత్రిలో ఒకటిగా పరిగణించబడుతుంది. మా కిడ్నీ వ్యాధి విభాగం అక్యూట్(కొద్ది కాలంగా ఉన్న) కిడ్నీ ఫెయిల్యూర్, గ్లోమెరులోనెఫ్రిటిస్, క్రానిక్ (దీర్ఘకాలిక) కిడ్నీ వ్యాధి, పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి (PKD), మధుమేహ కిడ్నీ వ్యాధి, అమిలోయిడోసిస్ (అమిలోయిడ్ ప్రోటీన్స్ ఏర్పడుట), హెమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ (HUS), ఆల్పోర్ట్ సిండ్రోమ్ - వారసత్వంగా మూత్రపిండాల వాపు (నెఫ్రిటిస్), నెఫ్రోపతిక్ సిస్టినోసిస్, ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లెరోసిస్ (FSGS), ఫాబ్రీ డిసీజ్, గుడ్‌పాస్చర్ సిండ్రోమ్ (యాంటీ-GBM డిసీజ్) మొదలైన వంటి మూత్రపిండాలకు సంబంధించిన పరిస్థితులు మరియు వ్యాధులతో ఉన్న చాలా మంది రోగులకు చికిత్స అందించింది.

కిడ్నీ మార్పిడి కోసం అపాయింట్‌మెంట్‌ని అభ్యర్థించండి

కిడ్నీ మార్పిడి ప్రక్రియ అంటే ఏమిటి? 

Kidney transplant meaning in Telugu


మూత్రపిండ మార్పిడి ప్రక్రియ అనగా వ్యాధిగ్రస్థులైన రోగి మూత్రపిండాన్ని ఆరోగ్యకరమైన దాత మూత్రపిండంతో భర్తీ చేసేదే ఈ శస్త్రచికిత్సా పద్ధతి. మూత్రపిండముని మరణించిన లేదా జీవించి ఉన్న అవయవ దాత నుండి తీసుకోవచ్చు. కిడ్నీ మార్పిడికి సరిగ్గా సరిపోయే కుటుంబ సభ్యులు లేదా ఇతరులు కూడా వారి కిడ్నీలో ఒకదానిని ఇవ్వవచ్చు. ఈ రకమైన మార్పిడిని ప్రత్యక్ష మార్పిడి (LIVE TRANSPLANT) అని కూడా అంటారు. కిడ్నీ దాతలు ఒక ఆరోగ్యకరమైన కిడ్నీతో ఎటువంటి ఆందోళన చెందకుండా దీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. 


సాధారణముగా, ఒక కిడ్నీని మాత్రమే రోగి కి మార్పిడి చేయగలరు. కానీ, కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే రెండు మూత్రపిండాల మార్పిడి జరుగుతుంది. మరణించిన దాత నుండి మూత్రపిండాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పాత మూత్రపిండంలు(కిడ్నీలు) సాధారణంగా తొలగించబడకుండా పొత్తికడుపులో ఉంచబడుతుంది. అయినప్పటికీ, పాత మూత్రపిండము రోగి యొక్క శరీరం నుండి క్రింద ఇచ్చిన సందర్భాలలో తొలగించబడుతుంది.


  • కొత్తగా మార్పిడి అయిన రోగి యొక్క కిడ్నీకి వ్యాపించగలిగే ఇన్ఫెక్షన్ వల్ల.
  • పాత మూత్రపిండాల వలన సంభవించే అనియంత్రిత రక్తపోటు లేదా చికిత్స చేయలేని పరిస్థితి వల్ల.
  • మూత్రం తిరిగి మల్లి మూత్రపిండాలలోకి రావడం (యూరినరీ రిఫ్లక్స్ వల్ల).
about kidney transplantation in telugu | kidney transplant meaning in telugu | best kidney transplant hospital in hyderabad, telangana, india

మూత్రపిండ మార్పిడికి సూచనలు

కిడ్నీ మార్పిడి అనేది ఎండ్-స్టేజ్ మూత్రపిండ వ్యాధిని (ESRD) సూచిస్తుంది, వీరికి కిడ్నీ వైఫల్యం అనేది (<15% మూత్రపిండాల పనితీరు లేదా గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేటు) ప్రాణాంతక వ్యాధిగా మారవచ్చు. శరీరం నుండి అదనపు వ్యర్థాలు మరియు ద్రవాలను తొలగించడానికి, రోగికి తరచుగా షెడ్యూల్ తో కూడిన డయాలసిస్ చేయాలి. కిడ్నీ మార్పిడి తరువాత డయాలిసిస్ యొక్క అవసరం ఉండకపోవచ్చు.


మూత్రపిండాల పనితీరును మళ్ళీ పునరుద్ధరించడానికి మూత్రపిండ మార్పిడి అనేది అవసరం, ఉదాహరణకు:

  • శరీరం నుండి యూరియా మరియు ఇతర ద్రవ వ్యర్థాలను తొలగించడం.
  • యూరియా అనేది మాంసం, పౌల్ట్రీ మరియు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే కూరగాయలు, ప్రోటీన్-రిచ్ ఆహరం శరీరంలో జీర్ణం అయినప్పుడు యూరియా ఉత్పత్తి అవుతుంది.
  • రక్తంలో లవణాలు, ఎలక్ట్రోలైట్లు మరియు ఇతర రక్త భాగాల నిర్వహణ.
  • ఎర్ర రక్త కణాల అభివృద్ధికి సహాయపడే ఎరిత్రోపోయిటిన్ అనే హార్మోన్ విడుదల.
  • రక్తపోటు, ద్రవాలు మరియు యాసిడ్-బేస్ బ్యాలెన్స్ నియంత్రణ.
  • పుట్టుకతో వచ్చే మూత్రపిండ అసాధారణతలు మరియు సమస్యలు తొలగించడానికి మూత్రపిండ మార్పిడి అవసరం కావచ్చు.


ఎండ్-స్టేజ్ మూత్రపిండ వ్యాధిని కలుగచేసే కారణాలు (ESRD)


ESRD వ్యాధి అనేక కిడ్నీ వ్యాధుల వల్ల సంభవించవచ్చు, అవేవనగా:

  • మూత్రపిండాల వైఫల్యాన్ని మధుమేహం మరియు అధిక రక్త పోటు ఎక్కువగా ప్రేరేపిస్తాయి (ఇది మొదటి ముఖ్యమైన కారణం) 
  • క్రమ పద్ధతిలో సంభవించే మూత్ర మార్గ అంటువ్యాధులు (UTIs).
  • పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి వంటి ఇతర వంశపారంపర్య వ్యాధులు.
  • గ్లోమెరులోనెఫ్రిటిస్, లేదా మూత్రపిండాల యొక్క వడపోత యూనిట్ల వాపు, మరియు ఎర్రబడిన పరిస్థితి.
  • హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ (HUS) అనే అరుదైన మూత్రపిండ వైఫల్యం.
  • లూపస్ మరియు ఇతర రోగనిరోధక వ్యవస్థ లోపాలు.

కిడ్నీ మార్పిడి రకాలు

కిడ్నీ మార్పిడి రకాలు అనేవి దాత మరియు వారి సజీవ స్థితిపై ఆధారపడి ఉంటాయి. ఇవి రెండు రకాలుగా విభజించబడ్డాయి.

  • మరణించిన (డికీస్డ్ డోనార్) దాత కిడ్నీ మార్పిడి
  • సజీవ-దాత (లివింగ్ డోనార్) కిడ్నీ మార్పిడి
types of kidney transplant surgery in telugu | kidney transplant price in india in telugu | cost of kidney transplant in telugu

మరణించిన దాత మూత్రపిండ మార్పిడి లేదా కాడెరిక్ మూత్రపిండ మార్పిడి

మరణించిన దాత మూత్రపిండ మార్పిడి ప్రక్రియ అనేది దాత మరణించిన తర్వాత బాగా పని చేయగలిగిన మరియు ఎటువంటి సమస్య లేని మూత్రపిండాన్ని శస్త్రచికిత్సతో మార్పిడి చేస్తారు. సాధారణంగా మరణించిన దాత అవయవాలు (కిడ్నీ) అనేవి మరణానికి ముందు అవయవ దాత వాళ్ళ ఇష్టపూర్వకంగా కార్డులపై సంతకం చేసి అంగీకరిస్తారు ఒకవేళ ఈ సంతకం ప్రక్రియ జరగనిచో మరణించిన వ్యక్తి యొక్క రక్త సంబంధీకులు ఈ అవయవ దానానికి అంగీకారం తెలపవచ్చును.


మరణించిన దాత మూత్రపిండాల రకాలు


మరణించిన దాత మూత్రపిండాలు వివిధ ఆకారాలు మరియు వివిధ పరిమాణాలలో ఉంటాయి. ఈ అంశాలు దాత అవయవాల యొక్క శరీర నిర్మాణ, జీవరసాయన మరియు సామాజిక లక్షణాలను వర్గీకరించడానికి ఉపయోగించబడతాయి. రోగికి ఈ పద్దతులలో ఏదైనా లేదా అన్నింటినీ తిరస్కరించే అవకాశం ఉంటుంది. మరణించిన దాతల వయస్సు, తీవ్రత, మరియు స్థితిని బట్టి ఇలా వర్గీకరించబడతారు:

  • ఖచ్చితమైన ప్రమాణం కలిగి ఉన్న దాతలు (స్టాండర్డ్ క్రైటీరియా డోనార్స్ - SCD
  • అధిక ప్రమాణాలు కలిగిన దాతలు (ఎక్సపండెడ్ క్రైటీరియా డోనార్స్ - ECD
  • కార్డియాక్ డెత్ (DCD) పొందిన దాత
  • అసాధారణమైన సాంఘిక ప్రవర్తన కలిగి ఉన్న దాతలు


ఖచ్చితమైన ప్రమాణం కలిగి ఉన్న దాతలు (స్టాండర్డ్ క్రైటీరియా డోనార్స్ -SCD): దాతలు ఎవరైతే 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండి వివిధ గాయాలు లేదా సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ వంటి పరిస్థితుల కారణంగా బ్రెయిన్ డెత్ వలన మరణించిన వ్యక్తులచే ఈ మూత్రపిండాలు దానం చేయబడతాయి.


అధిక ప్రమాణాలు కలిగిన దాతలు (ఎక్సపండెడ్ క్రైటీరియా డోనార్స్ -ECD): దాతలు ఎవరైతే 50-60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటారో వారు ఈ కింది పరిస్థితులను బట్టి దానం చేస్తారు:

  • పెరిగిన రక్తపోటు చరిత్ర ఉన్నప్పుడు
  • క్రియేటినిన్ (మూత్రపిండ బయోమార్కర్) స్థాయిలు (1.5 mg/dL) కంటే ఎక్కువగా ఉన్నప్పుడు


కార్డియాక్ డెత్ (DCD) కలిగిన దాత: దాతలు ఎవరైతే తీవ్రమైన మరియు కోలుకోలేని మెదడు గాయంతో బాధపడుతూ ఉండి, అధికారిక బ్రెయిన్ డెత్ ప్రమాణాల క్రైటీరియాలకు అనుగుణంగా లేని కారణం చేత కార్డియాక్ డెత్ (DCD) అయిన తర్వాత దాతలుగా పరిగణించబడతారు. రోగి గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత అవయవాలను తొలగించవచ్చు.


అసాధారణమైన సాంఘిక ప్రవర్తన కలిగి ఉన్న దాతలు: ఎవరికైతే  లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉండి అదే విధంగా మాదకద్రవ్యాల వాడే చరిత్రను కలిగి ఉండి మరియు  వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒంటరి జీవితాన్ని గడిపి ఉన్న వాళ్ళను దాతలుగా పరిగణించే ముందు అంటువ్యాధి పరీక్షలను చేసి, ఏదైనా కనుగొంటే అది దాతలకు గాని వారి సంరక్షకులకు తెలియజేయబడుతుంది.

సజీవ-దాత మూత్రపిండ మార్పిడి

సజీవ-దాత (జీవించి ఉన్న) మూత్రపిండ మార్పిడి అనేది ఒక శస్త్ర చికిత్స ప్రక్రియ, దీనిలో మూత్రపిండ వైఫల్యం ఉన్న వ్యక్తికి ఆరోగ్యకరమైన దాత మూత్రపిండముతో శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయబడుతుంది. ప్రత్యక్ష (లైవ్ డోనార్) దాత అనేవాడు సాధారణంగా కిడ్నీ గ్రహీత యొక్క తక్షణ కుటుంబంలో సభ్యుడు అయి ఉండాలి, ఉదాహరణకు తల్లిదండ్రులు, తోబుట్టువులు, బిడ్డ, మామ, అత్త, బంధువు, జీవిత భాగస్వామి లేదా స్నేహితుడు. కిడ్నీ అవసరం ఉన్నవారికి, సహాయం చేయాలనుకునే పరిచయం లేని లేదా సహృద భావం కలిగిన వ్యక్తులు కూడా కిడ్నీ దానం చేయవచ్చును.


సజీవ దాత నుండి తీసుకున్న మూత్రపిండం సాధారణంగా వెంటనే పని చేస్తుంది. కానీ మరణించిన దాత నుండి తీసుకున్న మూత్రపిండాల పనితీరును పునరుద్ధరించడానికి చాలా రోజులు లేదా వారాలు పట్టవచ్చు.

  • సజీవ దాత మార్పిడిని మనకి అనుకూల సమయంలో షెడ్యూల్ చేయవచ్చు, దీని వలన కిడ్నీ గ్రహీతకు మరియు దాతకు ఇద్దరికీ కిడ్నీ మార్పిడికి అవసరమైన సమయం దొరుకుతుంది, కానీ మరణించిన దాత కిడ్నీ లభ్యత అనేది సందేహాస్పదంగా ఉంటుంది, అయితే అది అందుబాటులో ఉంటే, శస్త్రచికిత్స వీలైనంత త్వరగా షెడ్యూల్ చేయొచ్చు.
  • తక్షణ మూత్రపిండ దాత (రక్త సంబధీకులు) విషయంలో, కిడ్నీ మార్పిడిని శరీరం తిరస్కరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
  • మరణించిన దాత కిడ్నీని కనుగొనడానికి పట్టే సమయం (దీనికి మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు పట్టవచ్చు) సాధారణంగా జీవించి ఉన్న దాత కిడ్నీ కంటే చాలా ఎక్కువ.

కిడ్నీ మార్పిడిని వ్యతిరేకించే సూచనలు

కిడ్నీలను దానం చేసే వ్యక్తికి ఉండవలసిన అర్హతలు లేదా ఉండకూడని సమస్యలు:

  • 18 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్లకు మరియు 70 ఏళ్లు పైబడిన వారికి కిడ్నీ మార్పిడి కి అర్హత లేదు
  • మధుమేహం, క్రియాశీల(ఆక్టివ్) ప్రాణాంతకత, అల్బుమినూరియా మరియు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవాళ్ళు
  • హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) ఉన్నవాళ్ళు
  • ఊబకాయం కల్గిన వాళ్ళు (BMI > 40 kg/m2)
  • గ్లోమెరులర్ వడపోత రేటు (GFR) 70 mL/min/1.72m2 కంటే తక్కువగా ఉన్నవాళ్లు
  • హైపర్‌టెన్సివ్ చికిత్స కోసం ఒకటి లేదా ఎక్కువ బీపీ మందులు వాడుతున్నవాళ్లు
  • గుర్రపు డెక్క ఆకారం కలిగి ఉన్న మూత్రపిండాలు కలిగి ఉండడం 


కిడ్నీ గ్రహీతలకు ఉన్న సంపూర్ణ వ్యతిరేకతలు లేదా అనర్హతలు:

  • తీవ్రమైన ఊపిరితిత్తులు లేదా గుండె జబ్బుల కారణంగా శస్త్రచికిత్సను తట్టుకోలేని వాళ్లలో కిడ్నీ మార్పిడి చేయడం అనేది సాధ్యం కాదు
  • క్రియాశీల ప్రాణాంతకత, క్రియాశీల మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు క్రియాశీల ఇన్ఫెక్షన్ కలిగి ఉండటం
  • అనియంత్రిత మానసిక వ్యాధిని కలిగి ఉండటం


కిడ్నీ గ్రహీతలకు సంబంధిత వ్యతిరేకతలు లేదా అనర్హతలు :

  • డయాలసిస్ చరిత్ర కలిగి ఉండి మరియు మందులు పాటించని రోగికి కిడ్నీ మార్పిడి అనేది కష్టతరం
  • మానసిక సమస్యలు ఉన్నవాళ్లలో మరియు బలహీన మనస్కులలో (సున్నితంగా మరియు బలహీనంగా ఉండే పరిస్థితి)కూడా మార్పిడి కష్టంగా ఉంటుంది
  • తక్కువ ఆయుర్దాయం కలిగిన రోగులు 

భారతదేశంలో కిడ్నీ మార్పిడి యొక్క ప్రయోజన / విజయవంతమైన శాతం

కిడ్నీ మార్పిడి ప్రక్రియలో ప్రపంచంలోనే అత్యధికంగా విజయవంతమైన రేటుని సాధించిన దేశాలలో భారత దేశం కూడా ఒకటిగా పరిగణించబడింది, కిడ్నీ మార్పిడి లో 90% తో విజయవంతమైన రేటులో సాగిపోతూ సుమారు సంవత్సరానికి 7500 కిడ్నీ మార్పిడిలను చేస్తుంది. ప్రస్తుతం, 90% వరకు జీవించి ఉన్న దాతల నుండి కిడ్నీలు తీసుకొనబడుతున్నాయి మరియు 10% మాత్రమే మరణించిన దాతల నుండి (బ్రెయిన్ స్ట్రోక్ లేదా ప్రమాదాల కారణంగా మరణించిన రోగులు) తీసుకోబడుతున్నాయి. 

కిడ్నీ సక్సెస్ (విజయ శాతం) రేటుతో సంబంధం ఉన్న అంశాలు:


  • ఆసుపత్రి ఎంపిక: అధునాతన సాంకేతికత, మంచి పరిశుభ్రత పద్ధతులు / విధానాలు, అత్యంత అనుభవజ్ఞులైన ట్రాన్స్‌ప్లాంట్ నెఫ్రాలజిస్ట్‌లు లేదా కిడ్నీ మార్పిడి సర్జన్‌లతో కూడిన ఆసుపత్రిని ఎంపిక చేసుకోవాలి.
  • కిడ్నీ అనుకూలత: మూత్రపిండ మార్పిడి విజయవంతమైన రేటులో అత్యంత కీలకమైనది జీవ అనుకూలత (సరిపడే తత్త్వం), అదే విధంగా బ్లడ్ గ్రూప్, బ్లడ్ క్రోస్ మాచింగ్, మరియు కణజాల మీద ఆధారపడి ఉంటుంది.
  • శస్త్రచికిత్స అనంతర సమస్యలు: శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల వల్ల సక్సెస్ రేటు తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • వయస్సు: కిడ్నీ మార్పిడి విజయ శాతం దాత రకాన్ని బట్టి మరియు వయస్సు వల్ల మారవచ్చు. ఉదాహరణకు, మరణించిన దాత మూత్రపిండ మార్పిడికి 5-సంవత్సరాల మనుగడ రేటుతో వృద్ధ రోగులలో (65 ఏళ్లు పైబడిన) 74.3% మరియు 18 మరియు 34 సంవత్సరాల మధ్య వయస్సు గల రోగులలో దాదాపు 96% గా పరిగణించబడింది. అదే విధంగా జీవ దాత మూత్ర పిండ మార్పిడితో పోల్చి చూస్తే 83.9 శాతం పెద్దవారిలో, అదేవిధంగా 97.8%. శాతం 18 మరియు 34 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో చూడటం జరిగింది.
Rules and Regulations for Kidney Transplant in India
By Pace Hospitals 19 Dec, 2022
Kidney transplantation in India is done under the rules and regulations laid by the Govt. of India. These rules and regulations are mainly to avoid illegal selling of organs for monetary benefit and to regulate the removal, storage and transplantation of organs for treatment purpose. Based on the source of donor organ, kidney transplant is classified as living donor transplantation or cadaveric (deceased-donor) transplantation.
  • కిడ్నీ మార్పిడి అనేది పెద్ద శస్త్రచికిత్సా?

    అవును, మూత్రపిండ మార్పిడి అనేది ఒక పెద్ద శస్త్రచికిత్స, ఈ చికిత్స లో మూత్రపిండ లోపం ఉన్న వ్యక్తి సజీవంగా ఉన్న లేదా మరణించిన దాత నుండి ఆరోగ్యకరమైన మూత్రపిండాన్ని పొందుతాడు. మూత్రపిండ మార్పిడి అనేది ఆరోగ్యకరమైన మూత్రపిండ పనితీరును అనుకరిస్తుంది, చివరి దశ మూత్రపిండ వ్యాధి ఉన్న రోగులలో సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితానికి ఈ మూత్రపిండ మార్పిడి అనేది ఒక మంచి ఎంపిక.

  • కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నొప్పిగా ఉంటుందా?

    మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత రోగి నొప్పిని అనుభవించవచ్చు అదే విధంగా వ్యక్తికి   నొప్పి మారుతూ ఉండవచ్చు. శస్త్రచికిత్స సమయంలో నరాల యొక్క స్థితి కొద్దిగా మారవచ్చు, అందువల్ల శస్త్రచికిత్స చేసిన కోత చుట్టూ తిమ్మిరిని కలిగిస్తుంది. మూత్రపిండ మార్పిడి వైద్యుడు వ్యక్తిగత రోగి పరిస్థితుల ఆధారంగా మందులను సూచించవచ్చు.

  • కిడ్నీ మార్పిడి తర్వాత కూడా మీకు డయాలసిస్ అవసరమా?

    డయాలసిస్ యొక్క ఆవశ్యకత మూత్రపిండ మార్పిడి (క్రొత్త మూత్రపిండ పనితీరుపై) విజయవంతమైన రేటుపై ఆధారపడి ఉంటుంది. విజయవంతమైన మూత్రపిండ మార్పిడి తర్వాత, రోగికి ఎక్కువ డయాలసిస్ సెషన్లు అవసరం లేదు. ఎందుకంటే మార్పిడి చేయబడిన మూత్రపిండము, ఆరోగ్యకరమైన మూత్రపిండము వలె పని చేస్తుంది. మూత్రపిండ మార్పిడి విఫలమైతే, రెండవ లేదా తదుపరి మూత్రపిండ మార్పిడి సెషన్ నిర్వహించబడే వరకు రోగి డయాలసిస్‌లో ఉంటాడు.


  • కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు ఎంత సమయం పడుతుంది?

    కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనేది దాదాపు 4 నుండి 6 గంటల సమయం పట్టే ప్రధాన శస్త్ర చికిత్స. ఎందుకంటే ఇది ఒకేసారి రెండు శస్త్రచికిత్సలను కలిగి ఉంటుంది - గ్రహీత నుండి పాడైపోయిన కిడ్నీని తీసి, అదే సమయంలో దాత యొక్క కిడ్నీతో భర్తీ చేయడం జరుగుతుంది.

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు చేయవలసిన ప్రక్రియలు

మూత్రపిండ మార్పిడికి సిద్ధపడటం అనేది ప్రధానంగా అనుకూలమైన కిడ్నీని దానం చేసే భాగస్వామిని కనుగొనడం.


జీవించి ఉన్న లేదా మరణించిన కిడ్నీ దాతకు రోగితో సంబంధం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. దాత మూత్రపిండం రోగికి సరిగ్గా సరిపోతుందో లేదో అని నిర్ణయించేటప్పుడు, కిడ్నీ మార్పిడి చేసే బృందం అనేక వేరియబుల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది. దానిలో భాగంగా, దానం చేయబడిన మూత్రపిండము రోగికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింది పరీక్షలను చేసి తెలుసుకుంటారు.

  • బ్లడ్ టైపింగ్: బ్లడ్ టైపింగ్ అనేది దాత మరియు కిడ్నీ గ్రహీత యొక్క రక్త సమూహాల అనుకూలతను నిర్ణయించే పద్ధతి. ఈ పరీక్ష వివిధ రక్త రకాలకు స్పందించే (యాంటీబోడీఎస్) రక్త ప్రతిరోధకాలను గుర్తిస్తుంది. రక్త-రకం (బ్లడ్ టైపు అననుకూలత). అననుకూల మార్పిడి కూడా సాధ్యమే, ఇక్కడ అవయవ తిరస్కరణ అవకాశం తక్కువ చేయడానికి ప్రక్రియకు ముందు మరియు తర్వాత అదనపు వైద్య చికిత్స అవసరమవుతుంది; వీటిని ABO అననుకూల మూత్రపిండ మార్పిడి అంటారు.
  • టిష్యూ టైపింగ్: రోగి యొక్క రక్త రకాలు అనుకూలంగా ఉంటే, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ (HLA) టైపింగ్ అని పిలువబడే కణజాల టైపింగ్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష దానం చేయబడిన కిడ్నీ ఎంతకాలం ఉంటుందో అంచనా వేసి జన్యు గుర్తులను పోల్చి చూస్తుంది రోగి శరీరం బాగా సరిపోలితే అవయవాన్ని తిరస్కరించే అవకాశం తక్కువ ఉంటుంది. 
  • క్రాస్‌మ్యాచ్: మూడవ మరియు చివరి సరిపోలిక పరీక్ష కోసం ల్యాబ్‌లో రోగి (కిడ్నీ గ్రహీత) రక్తాన్ని కొద్ది మొత్తంలో దాత రక్తంలో కలుపుతారు. రోగి రక్తంలోని ప్రతిరోధకాలు(యాంటీబోడీస్) దాత యొక్క రక్తంలోని యాంటిజెన్‌లకు స్పందిస్తాయో లేదో అని పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో అనుకూల స్పందన వచ్చినట్లైతే రోగి శరీరం, మార్పిడి ప్రక్రియను తిరస్కరించదు. అదేవిధంగా ప్రతికూల స్పందన వచ్చినప్పటికీ కూడా రోగి శరీరం ఈ ప్రక్రియకు, కానీ ప్రతికూల సందర్బములో కొన్ని వైద్య పరమైన జాగ్రత్తలు శస్త్ర చికిత్సకు ముందు, తరువాత తీసుకోవడం ద్వారా రోగి యొక్క ప్రతిరోధకాలు (యాంటీబోడీస్) స్పందించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


కిడ్నీ గ్రహీత కి ఉత్తమమైన దాత కిడ్నీ కోసం వెతుకుతున్నప్పుడు సరి పోలే వయస్సు, కిడ్నీ పరిమాణం మరియు వ్యాధి సంక్రమణలు, ఇలాంటి పరిస్థితులు కిడ్నీ మార్పిడి బృందం అంచనా వేయగలగాలి. 


ఒకవేళ రోగి(కిడ్నీ గ్రహీత) డయాలసిస్‌లో ఉంటే, శస్త్రచికిత్సకు ముందు రోగి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. ప్రణాళికాబద్ధమైన(షెడ్యూల్డ్) జీవన మూత్రపిండ మార్పిడి కోసం రోగి (కిడ్నీ గ్రహీత) 8 గంటల పాటు ఉపవాసం ఉండాలి. మరణించిన వ్యక్తి కిడ్నీ మార్పిడి విషయంలో మాత్రం, మూత్రపిండము అందుబాటులోకి వచ్చినప్పటి నుండి రోగి ఉపవాసం ఉండాలి.

రోగి పరిస్థితి ఆధారం చేసుకొని, మూత్రపిండ మార్పిడి చేసే సర్జన్ ఏదైనా ఇతర సూచనలను సూచించవచ్చు.

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స సమయంలో రోగి ఏమి ఆశించాలి?

ఆసుపత్రికి వెళ్లే సమయం గురించి మూత్రపిండ సర్జన్ రోగికి తెలియజేస్తాడు. సర్జన్ కిడ్నీ మార్పిడి ప్రక్రియ గురించి రోగికి వివరిస్తాడు అదే విధంగా రోగి అంగీకార సంతకం కోసం రోగికి సమాచార సమ్మతి పత్రం ఇవ్వబడుతుంది, ఈ అంగీకార పత్రం అనేది మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించి కొనసాగించడానికి కిడ్నీ మార్పిడి సర్జన్‌కు అధికారంని ఇస్తుంది. అంగీకార పత్రం పై సంతకం చేసే ముందు, రోగి సమ్మతి పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి మరియు అతను లేదా ఆమెకు ఏవైనా సందేహాలు ఉంటె మూత్రపిండ మార్పిడి సర్జన్ వద్ద స్పష్టం చేసుకోవాలి.

  • రోగి దుస్తులను మార్చుకోవడానికి సర్జికల్ గౌను అందజేస్తారు.
  • ఇంట్రావీనస్ లైన్‌ని రోగి చేయికి పెట్టబడుతుంది, దీని ద్వారా మందులు మరియు మత్తుమందులని రోగిలోకి పంపిస్తారు 
  • శస్త్రచికిత్సకు ముందు, తర్వాత మరియు ప్రకియ జరుగుతున్న సమయంలో, శస్త్రచికిత్స బృందం రోగి యొక్క హృదయ స్పందనని మరియు రక్తపోటుని (చెక్) చేస్తూ ఉంటుంది. రోగికి ఆపరేషన్ చేయడానికి సర్జికల్ సైటును శుభ్రం చేయాలి (వెంట్రుకలు ఎక్కువగా ఉన్నట్లయితే తొలగించడం జరుగుతుంది).


కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విధానం:

  • ముందుగా రోగి మూత్రాశయంలోకి యూరినరీ కేథటర్ చొప్పించబడుతుంది, తరువాత రోగిని ఆపరేటింగ్ టేబల్పై వెనుక భాగంలో పండుకొనపెడతారు.
  • రోగి యొక్క నోటిద్వారంకుండా ఊపిరితిత్తులలోకి ఒక ట్యూబ్ పెట్టబడుతుంది. ఈ ట్యూబ్ ద్వారా రోగికి కృత్రిమ శ్వాస అందించబడుతుంది. 
  • శస్త్ర చికిత్స జరిగిన చర్మ ప్రాంతంలో క్రిమినాశక మందుతో శుభ్రం చేస్తారు. తద్వారా రోగి వ్యాధులకు బహిర్గతం కాలేడు.
  • శస్త్ర చికిత్స నిపుణులు రోగి పొత్తికడుపు దిగువ భాగంలో కోత చేసి, దానం చేయబడిన మూత్రపిండాన్ని శరీరంలోకి పంపించి అమరుస్తారు. ఈ ప్రక్రియ చేసే ముందు దానం చేయబడిన మూత్రపిండాన్ని వైద్యుడు పరిశీలిస్తాడు.
  • పరిశీలించబడిన మూత్రపిండము రోగికి అనుకూలంగా ఉన్నచో అది రోగికి అమర్చబడుతుంది. దానం చేయబడిన కుడి కిడ్నీని రోగికి ఎడమ వైపున అదే విధముగా, దానంచేయబడిన ఎడమ కిడ్నీని రోగికి కుడి పక్కన అమర్చబడుతుంది. రోగి యొక్క యురేటర్ని మూత్రపిండ భాగానికి సులువుగా జత చేయొచ్చు.
  • అమర్చబడిన మూత్రపిండం యొక్క ధమని మరియు సిరులు రోగి యొక్క బాహ్య ఇలియాక్ ధమని మరియు సిరులకు జతచేయబడుతుంది.
  • ఆర్టెరీస్ ని మరియు వెయిన్స్ ని వాటి స్థానములలో కలిపాక, కుట్లు వేసిన చోట ఏదైనా రక్త స్రావ సంకేతాలు ఉన్నాయేమో అని, రక్త నాళాలలో రక్త ప్రవాహాన్ని పరీక్షిస్తారు. 
  • మూత్రపిండాన్ని మూత్రాశయానికి కలిపే గొట్టంని(ఉరేటర్), దాత యొక్క మూత్ర నాళనికి అమర్చుతారు.
  • కోత(కట్)ను మూసివేయడానికి కుట్లు లేదా సర్జికల్ స్టేపుల్స్ని ఉపయోగిస్తారు, వాపును తగ్గించడానికి డ్రైన్ ని ఉపయోగిస్తారు. శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో శుభ్రమైన కట్టు లేదా డ్రెస్సింగ్ ని వాడుతారు .

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత రోగి ఏమి ఆశించాలి?

మూత్రపిండ మార్పిడి ప్రక్రియ తర్వాత దశలు:

  • మూత్రపిండ మార్పిడి జరిగిన తర్వాత శస్త్రచికిత్స సంరక్షణ కోసం రోగిని రికవరీ గదికి మారుస్తారు. రోగి యొక్క రక్తపోటు, పల్స్ మరియు శ్వాసక్రియ స్థిర పడిన తర్వాత రోగి యొక్క స్థితిని పర్యవేక్షించడానికి  ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కి తరలించవచ్చు. రోగి కోలుకున్న తర్వాత ICU నుండి సాధారణ గదికి తరలిస్తారు.
  • జీవించి ఉన్న దాత నుండి మార్పిడి చేసిన మూత్రపిండం ప్రక్రియ జరిగిన వెంటనే మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించవచ్చు. మరణించిన వారి నుండి తీసుకున్న మూత్రపిండం యొక్క మూత్ర విసర్జనకు మాత్రం ఎక్కువ సమయం పట్టవచ్చు. మూత్ర విసర్జన సాధారణ స్థితికి వచ్చే వరకు రోగికి డయాలసిస్‌ను చేసే అవకాశం ఉంది.
  • మూత్రాన్ని తొలగించడానికి రోగి మూత్రాశయంలో కాథెటర్‌ను ఉంచుతారు.కొత్త కిడ్నీ పనితీరును కొలిచేందుకు డ్రైన్డ్ వాల్యూమ్ సహాయం చేస్తుంది.
  • రోగి తనంతట తానుగా తగినంత ద్రవాలు మరియు ఆహారాన్ని తీసుకునెంత వరకు రోగికి ఇంట్రావీనస్ ద్రవాలను అందిస్తారు.
  • రోగి సరైన మందులను తీసుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి అదే విధంగా  రోగిపై వాడబడిన కిడ్నీ మార్పిడి వ్యతిరేక తిరస్కరణ మందులు (జరిగిన ప్రక్రియ విఫలం కాకుండా ఉండటానికి వాడిన మందులు) ఎలా పని చేస్తున్నాయో అని తెలుసుకోవడానికి మూత్రపిండ సర్జన్ బృందం రోగి అక్కడ ఉన్నంత వరకు నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది.
  • కొత్త మూత్రపిండాల ఆరోగ్య స్థితిని, కాలేయం, ఊపిరితిత్తులు మరియు రక్త వ్యవస్థ వంటి ఇతర అవయవాల పనితీరుని, వ్యవస్థలను పర్యవేక్షించడానికి, రోగి యొక్క రక్త నమూనాలు తీసుకుంటారు.
  • రోగి ముందుగా కొన్ని ద్రవ పదార్థములను తీస్కుని, వైద్యులు సూచించిన పిమ్మట నెమ్మదిగా ఘన పదార్థములను తీసుకొనును. అందుచేత అధిక ఒత్తిడి పడకుండా నివారించవచ్చును .చికిత్స తర్వాత రోగులు మరుసటి రోజు కొంచం నడవడం, చుట్టూ తిరగడం చేయాలి.
  • వైద్యుడు సూచించినట్లుగ, రోగి నొప్పి కోసం నొప్పి మందులను తీసుకోవాలి.
  • రక్తస్రావ ప్రమాదాన్ని పెంచే ఆస్పిరిన్ లేదా ఇతర పెయిన్ కిల్లర్స్ ని రోగి ఉపయోగించకుడదు.
  • డిశ్చార్జ్ సమయంలో, రోగికి కోత గూర్చిన జాగ్రత్తలు, ఆహారం మరియు మందుల వాడుకకు సంబంధించిన కౌన్సెలింగ్ అందిస్తారు.

మూత్రపిండ మార్పిడి ప్రక్రియ యొక్క సమస్యలు

కొన్ని ముఖ్యమైన సమస్యలు మూత్రపిండ మార్పిడి సమయంలో తలెత్తవచ్చు: 

  • రక్తస్రావం మరియు రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం
  • మూత్రపిండము మరియు మూత్రాశయాన్ని కలిపే యురేటర్ ట్యూబ్ లో అవరోధం
  • దానం చేయబడిన మూత్రపిండము యొక్క పని తీరు విఫలమవ్వొచ్చు లేదా శరీరం తిరస్కరించవచ్చు
  • అవయవ మార్పిడి ద్వారా క్యాన్సర్ లేదా అంటు వ్యాధులు వ్యాపించవచ్చు
  • ఈ మార్పిడి ద్వారా గుండె మరియు మెదడు రక్తనాలాల సమస్యలు రావొచ్చు
  • కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించవచ్చు 
  • శస్త్రచికిత్స వల్ల ఇన్ఫెక్షన్ రావొచ్చు
kidney transplant complications in telugu | complications after kidney transplant in telugu | kidney transplant healthy after telugu | kidney transplantation meaning in telugu

కిడ్నీ మార్పిడి వ్యతిరేక తిరస్కరణ మందుల దుష్ప్రభావాలు

మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స సమయంలో ముఖ్యమైన సమస్యలు తలెత్తవచ్చు మరియు అవి ఇలాంటి లక్షణాలని కలిగి ఉండొచ్చు :

  • రక్తస్రావం మరియు రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం.
  • మూత్రపిండము మరియు మూత్రాశయాన్ని కలిపే యురేటర్ ట్యూబ్ లో అవరోధం.
  • దానం చేయబడిన మూత్రపిండము యొక్క పని తీరు విఫలమవ్వొచ్చు లేదా శరీరం తిరస్కరించవచ్చు.
  • అవయవ మార్పిడి ద్వారా క్యాన్సర్ లేదా అంటు వ్యాధులు వ్యాపించవచ్చు.
  • ఈ మార్పిడి ద్వారా గుండె మరియు మెదడు రక్తనాలాల సమస్యలు రావొచ్చు.
  • కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించవచ్చు.
  • శస్త్రచికిత్సా వల్ల ఇన్ఫెక్షన్ రావొచ్చు.

కిడ్నీ మార్పిడి తర్వాత రోగి అడిగే ప్రశ్నలు

  • లోపల ఉన్న నా పాత కిడ్నీ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
  • నా కిడ్నీ విజయవంతంగా మార్చబడిందా?
  • నేను నా సాధారణ పని కోసం ఎప్పుడు వెళ్లగలను?
  • నేను ఎంత ద్రవాన్ని తీసుకోవాలి?
  • కిడ్నీ మార్పిడి తర్వాత నేను డయాలసిస్ చేయించుకోవాలా?
  • శస్త్రచికిత్సకు ముందు ఆపివేసిన నా పాత మందులను ఎప్పుడు పునఃప్రారంభించాలి?
  • నా కుట్లు ఎప్పుడు తీసివేయబడతాయి?
  • డిశ్చార్జ్ సమయంలో: ఫాలో-అప్ కోసం ఎప్పుడు తిరిగి రావాలి?

కిడ్నీ మార్పిడి పేషెంట్ టెస్టిమోనియల్

బంగ్లాదేశ్ రోగి, 32 ఏళ్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) తో విజయవంతంగా మూత్రపిండ మార్పిడితో చికిత్స పొందారు మరియు తదుపరి మూత్ర పరీక్షతో రోగి ఎటువంటి ప్రోటీన్యూరియా, హెమటూరియా, జ్వరం మరియు అంటుకట్టుట సున్నితత్వం లేకుండా మెరుగుదల చూపించారు.

తరచుగా అడుగు ప్రశ్నలు:


కిడ్నీ మార్పిడిని ఎవరు చేయించుకోవచ్చు?

పిల్లల నుండి వృద్ధుల వరకు వివిధ వయసుల వ్యక్తులకు కిడ్నీ మార్పిడి అందుబాటులో ఉంది. ఈ ప్రక్రియ పొందడానికి, కిడ్నీ ని తీసుకునే ఆరోగ్యంతో ఉండగలగాలి. అదనంగా, రోగి తప్పనిసరిగా క్యాన్సర్ మరియు ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి. ఒక వ్యక్తి తాను కిడ్నీ మార్పిడికి మంచి అభ్యర్థి మరియు అర్హుడు అని నిర్ధారించడానికి, సమగ్ర వైద్య మరియు మానసిక నిర్ధారణ పరీక్షా చేయించుకోవాల్సి వస్తుంది. పరిష్కరించగలిగే ఏవైనా సమస్యలను కిడ్నీ మార్పిడికి ముందు గుర్తించడంలో ఈ నిర్ధారణ సహాయపడుతుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా మంది ప్రజలకు ఒక అద్భుతమైన చికిత్సా ఎంపిక.

కిడ్నీ మార్పిడికి ఎవరు అర్హులుకారు?

చాలా మంది రోగులు కిడ్నీ మార్పిడికి వాళ్ళ వయస్సు సహకరించిందని నమ్ముతారు; అయినప్పటికీ, రోగి ఆరోగ్యంగా ఉన్నట్లయితే కిడ్నీ మార్పిడి అర్హతలో వయస్సును పరిగణనలోకి తీసుకోరు. కానీ, కొన్ని ఇతర సమస్యలు, మూత్రపిండాల మార్పిడికి అడ్డుగా ఉండవచ్చు, ఇవి ఒక వ్యక్తిని కిడ్నీ మార్పిడిని స్వీకరించకుండా నిరోధించవచ్చు, అవి:

  • ఆయుర్దాయం ఐదేళ్ల కంటే ఉండటం.
  • ఇటీవల సంభవించిన క్యాన్సర్ (కొన్ని చర్మ క్యాన్సర్లు కాకుండా)
  • నయం చేయలేని గుండె జబ్బు
  • నయం చేయలేని మానసిక రుగ్మత
  • డయాలసిస్ అపాయింట్‌మెంట్‌లు తప్పిపోవడం లేదా యంత్రం ముందుగానే ఆఫ్ చేయడం.
  • మత్తుపథార్థాల దుర్వినియోగం (మద్యం లేదా డ్రగ్స్)

నేను ఎప్పుడు కిడ్నీ మార్పిడి చేయించుకోవాలి?

రోగి ఎంత త్వరగా కిడ్నీ మార్పిడి చేయించుకుంటే అంత మంచిది. కిడ్నీ మార్పిడి కి అనువైన సమయాన్ని నెఫ్రాలజిస్టులు మరియు మూత్రపిండ మార్పిడి బృందం ఎంపిక చేస్తారు.

కిడ్నీ మార్పిడి ఎంతకాలం ఉంటుంది?

మూత్రపిండ మార్పిడి యొక్క విజయవంతమైన రేటు చాలా ఎక్కువగా ఉంది, దాదాపు 95% వరకు ఉంటుంది . జీవించి ఉన్న దాత నుండి తీసుకున్న కిడ్నీ యొక్క సాధారణ జీవితకాలం 15-20 సంవత్సరాలు, కానీ మరణించిన దాత నుండి తీసుకున్న కిడ్నీ జీవితకాలం కేవలం 10-15 సంవత్సరాలు. మార్పిడి విఫలమైన సందర్భంలో, రోగి డయాలసిస్ చికిత్సను ప్రారంభించవచ్చు లేదా రెండవ అవయవ దాత కోసం వెతకవచ్చు.

నేను ఎప్పుడు పనికి తిరిగి వెళ్లగలను?

రోగి తిరిగి పనికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అనేది రోగి కోలుకోవడం, రోగి చేసే పని రకం మరియు రోగికి ఉన్న ఏవైనా ఇతర వైద్య సమస్యల ద్వారా నిర్ణయించబడుతుంది. వారి మార్పిడి తర్వాత, చాలా మంది వ్యక్తులు ఎనిమిది వారాలు లేదా అంతకంటే ఎక్కువ తర్వాత తిరిగి పని చేయగలుగుతారు. రోగి పనిని ఎప్పుడు ప్రారంభించాలో కిడ్నీ మార్పిడి బృందం నిర్ణయిస్తుంది.

డయాలసిస్ కంటే కిడ్నీ మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

డయాలసిస్ అనేది ప్రాణాలను రక్షించే ప్రక్రియ, ఇది ఆరోగ్యకరమైన మూత్రపిండాలు చేసే విధుల్లో(పనులలో) కేవలం 10% మాత్రమే చేస్తుంది. డయాలసిస్ ప్రభావం ఫలితంగా శరీరం పై వివిధ ఆరోగ్య సమస్యలను తలెత్తవోచ్చు.


డయాలసిస్‌ చేయించుకుంటున్న వాళ్ళ కంటే మూత్రపిండ మార్పిడి చేయించుకున్న వాళ్ళల్లో గరిష్ట జీవిత కాలం, సగటున 10 - 15 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుందని అంచనా. అదనంగా, మార్పిడి వారి జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందని మెజారిటీ ప్రజలు పేర్కొన్నారు.

మార్పిడి తర్వాత పాత మూత్రపిండాలకు ఏమి జరుగుతుంది?

వ్యాధిగ్రస్తులైన మూత్రపిండాలు చాలా సందర్భాలలో తొలగించబడవు. కింది మూడు కారణాలలో ఒకదాని వల్ల దెబ్బతిన్న కిడ్నీలను తొలగించాల్సి రావచ్చు:

  • పాత కిడ్నీ వల్ల మార్పిడి చేయబడిన కిడ్నీకి ఒకవేళ నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంటే
  • సహజ మూత్రపిండాలు శరీరం లో నియంత్రించలేని రక్తపోటుకు కారణమైతే
  • మూత్రం తిరిగి మళ్ళి మూత్రపిండాలలోకి రావడం (యూరినరీ రిఫ్లక్స్ వల్ల)

ఒక వ్యక్తికి ఎన్ని కిడ్నీ మార్పిడిలు చేయవచ్చు?

ఒక రోగికి ఒకటి కంటే ఎక్కువ మార్పిడిలు చేయవచ్చు, ఇది వారి వయస్సుపై మరియు వారి శరీరంపై ఇంతక ముందు ఎన్ని సార్లు ఈ ప్రక్రియ జరిగింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రోగికి వారి జీవితకాలంలో రెండు, మూడు లేదా నాలుగు మూత్రపిండ మార్పిడిని కూడా చేయవచ్చు. మూత్రపిండ శస్త్ర నిపుణులు రోగి పరిస్థితిని మరియు నష్ట ప్రయోజన నిష్పత్తిని అధ్యయనం చేసి తద్వారా తదుపరి నిర్ణయం తీసుకుంటారు.

కిడ్నీ మార్పిడి జరిగిన  వ్యక్తి ఎంతకాలం జీవించగలడు?

సాధారణంగా, విజయవంతమైన మూత్రపిండ మార్పిడిని జరిగిన కిడ్నీ రోగులు వారి జీవన నాణ్యతలో మెరుగుదలని చూడవచ్చు. మార్పిడిలో ఉపయోగించే దాత కిడ్నీ రకాన్ని బట్టి మనుగడ వ్యవధి నిర్ణయించబడుతుంది. జీవించి ఉన్న దాత నుండి తీసుకున్న కిడ్నీ సాధారణంగా 12-20 సంవత్సరాలు పని చేస్తుంది, అయితే మరణించిన దాత నుండి తీసుకున్న కిడ్నీ 8-12 సంవత్సరాలు మాత్రమే పని చేస్తుంది.

తెలంగాణలో హైదరాబాద్‌ నందు కిడ్నీ మార్పిడి కోసం దాతను ఎలా పొందాలి?

జీవించి ఉన్న రక్త సంబంధీకులు లేదా దగ్గర కుటుంబ సభ్యుల నుండి కిడ్నీని పొందవచ్చు. జీవించి ఉన్న దాత లేనట్లయితే, కిడ్నీ మార్పిడి కోసం వేచి ఉన్న వ్యక్తి తెలంగాణలోని హైదరాబాద్‌ నందు AACT, జీవన్ దాన్ అవయవ మార్పిడి కేంద్రంలో దాతల నిరీక్షణ జాబితా నందు వారి పేరును నమోదు చేసుకొనవలెను. 


జీవందన్ (JEEVANDAN) అనేది తెలంగాణ ప్రభుత్వంచే ప్రారంభించబడిన సమగ్ర శవ అవయవ మార్పిడి పథకం, అవయవ మార్పిడి కొరకు ప్రోత్సహం అందించడానికి కాడవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అడ్వైజరీ కమిటీ (CTAC)ని ప్రతిపాదించింది. అవయవ గ్రహీత నమోదు రెండు కేటగిరీలుగా జరుగుతుంది.

  1. అత్యవసర మార్పిడి
  2. ఎంపిక మార్పిడి


జీవందన్ (JEEVANDAN) క్యాడవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రోగ్రామ్, తెలంగాణ శవ దాతల జాబితాకు మరియు మరణించిన దాత ఉన్న అవయవ మార్పిడి కేంద్రంకి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఏదైనా కారణం చేత, జాబితాలో ఉన్న కిడ్నీ గ్రహీత తిరస్కరిస్తే, అవయవం తరువాతి వరుస లో ఉన్న సాధారణ జాబితాకు పంపబడుతుంది


ఎలక్టివ్ లిస్ట్ మరియు జనరల్ పూల్ కంటే సూపర్ అర్జెంట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నమోదుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

భారతదేశంలో హైదరాబాద్‌ నందు ఉత్తమ మూత్రపిండ మార్పిడి ఆసుపత్రి ఏది?

పేస్ హాస్పిటల్స్ (PACE Hospitals) భారతదేశంలో హైదరాబాదు నందు ఉత్తమ మూత్రపిండ మార్పిడి ఆసుపత్రులలో ఒకటిగ ఉంది. ఇది మల్టీడిసిప్లినరీ అడల్ట్ & పీడియాట్రిక్ కిడ్నీ మార్పిడి బృందం మరియు అంకితమైన కిడ్నీ మార్పిడి ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు) చేత బ్యాకప్ చేయబడింది. ప్రపంచంలోని మొట్టమొదటి యూనివర్సల్ సర్జికల్ రోబోటిక్ సిస్టం - CRRTని కూడా అదనంగా కలిగి ఉంది. అత్యాధునిక లేజర్ చికిత్స పరికరాల సదుపాయం మరియు ఆధునిక సాంకేతికత కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

భారతదేశంలో కిడ్నీ మార్పిడికి ఎంత ఖర్చవుతుంది?

భారతదేశంలో కిడ్నీ మార్పిడికి సగటు ఖర్చు సుమారు రూ. 8,75,000 (ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు). అయితే, భారతదేశంలో కిడ్నీ మార్పిడి ధర రూ. 6,20,000 నుండి రూ. 12,75,000 (ఆరు లక్షల ఇరవై వేల నుండి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు) వరకు మారుతూ ఒక్కో కేసుకు భిన్నంగా మరియు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, వివిధ నగరాల్లోని వివిధ ఆసుపత్రులను బట్టి ఖర్చు మారవచ్చు.

హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు ఎంత?

హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడి ధర రూ. 6,50,000 నుండి రూ. 9,00,000 (ఆరు లక్షల యాభై వేల నుండి తొమ్మిది లక్షలు) వరకు ఉండొచ్చు.అయితే, హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడి ధర, రోగి యొక్క వయస్సు, పరిస్థితి, బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్, అతనికి ఉండే ఇతర అనారోగ్య సమస్యలు, ఆసుపత్రిలో గది ఎంపిక మరియు, CGHS, ESI, EHS, TPA- ఇన్సూరెన్స్ లేదా నగదు రహిత సదుపాయం కోసం కార్పొరేట్ ఆమోదాలు వంటి బహుళ అంశాలపై ఆధారపడి ఉంటుంది.


Share by: